మనం ప్రయాణాలు చేస్తూఉంటాము. ఈరోజు కూడా మీరు ప్రయాణం చేస్తున్నారు. అయితే ప్రయాణానికి మనం ఒక వాహనాన్ని వాడుకుని అనుకున్న స్థలముకు వెళ్లి అక్కడ పని పూర్తి చేసుకుని వస్తాము. అయితే మనం మన ప్రయాణం లో కొంచెం దూరం వెళ్ళిన తరువాత మన వాహనం లో ఇంధనం కొరత వచ్చింది, మనకు అందుబాటులో ఇంధనం దొరికే అవకాశం లేదు. అయితే త్రోవ పక్కన కాలువలో నిండుగా నీరు పారుతుంది కదా అని దానిలోనుండి కొంచే పట్టుకుని వచ్చి మన వాహనం లో పోసి దానిని నడుప గలమా? అది పని చెయ్యదు గదా? అలా అని దానిని తయారు చేసిన వానిమీద గోడవపెట్టుకుంటే వాడు ఏమంటాడు. నీ వాహనానికి గ్యారంటి ఉంది, వారంటి ఉంది కాని అది మీకు వర్తించదు అంటాడు. ఎందుకు అని అడిగితే వాహనాన్ని ఎలా వాడాలో మీకు ఇచ్చిన సూచన పుస్తకం లోని విషయలను మీరు సరిగా పాటించాలి అంటాడు. అసలు ఆలాంటి ఒకటి ఉందా అని అలోసిస్తాం కదా? ఆ పుస్తకం ఉందని మాకు తెలియదు అనినా మన మాటకు సమాధానం ఉండదు. మీకు అర్ధం అయ్యివుంటుందని నా ఆశ. ఇక్కడ నీవు అంటే నీవే, వాహనం అంటే నీ శరీరం, ప్రయాణం అంటే భూమి మీద నీ జీవితం, పని అంటే ఇక్కడ నీవు చెయ్యాల్సిన బాధ్యత, ఇంధనం ఆహరం, నీరు ఆహారం కానిది, తయారుచేసిన వాడు దేవుడు, సూచనల పుస్తకం దేవుని వాక్యం. సామెతలు 23 : 2,3 నీవు తిండి పోతువైన యెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము ఫిలిప్పి ౩:19 నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. సామెతలు 23 : 21 త్రాగు బోతులును తిండి బోతులును ధరిద్రులగుదురు. 1 కొరింది 9:27 బ్రస్టుడనై పోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకోను చున్నాను. దేవుడు మీ శరీరములో ఆరోగ్యమును ఆనందమును క్షేమమును అనుగ్రహించును గాక.
మీ కొరకు ప్రార్ధించే,
అపోస్తులు నాని బాబు నెల్లి